బెజవాడలో పాలి'ట్రిక్స్' : వంగవీటి రాధాతో వల్లభనేని వంశీ భేటీ
బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దివంగత వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధాతో టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం సమావేశమయ్యారు. వీరిద్దరి ఆసక్తిర భేటీ ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా వంగవీటి రాధా ఉంటున్నారు. అలాంటి రాధాను వల్లభనేని వంశీ కలవడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, వర్థంతి వేడుకల్లో పాల్గొన్నారు.
చాలా కాలం తర్వాత వంగవీటి రాధా, వల్లభనేని వంశీలు కలుసుకోవడం ఇపుడు చర్చనీయాంశంగానూ, ఆసక్తికగానూ మారింది. కాగా, మూడు నెలల క్రితం కూడా వంగవీటి రాధా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి కొడాలి నానితో కలిసి పాల్గొన్న విషయంతెల్సిందే.