ఆంధ్రలో థియేటర్ల రేట్లు తగ్గింపు ఓటీటీ మార్కెట్ కోసమేనా!
ఆంధ్ర ప్రదేశ్‌లో మున్సిపాలిటీలు, గ్రామాలలో వున్న థియేటర్లను మూసి వేయడానికి కారణం ఇదే నంటూ ఎగ్జిబిటర్లు ఆయా థియేటర్ల ముందు బోర్డులు పెట్టారు. విజయవాడలో టిక్కట్లరేటు ఒకలా వుంటే, అమలాపురం వంటి చాలా ఊల్ళలో మరింత తక్కువగా వున్నాయి. వాటిని ఆయా ధియేర్ల యాజమాన్యం ఇలా బోర్డులను పెట్టింది.
ఇక పట్టణాలలో విజయవాడలో సైతం కొన్ని థియేటర్లు మూతపడే దిశగా వున్నాయి. ఇప్పటికే పలు థియేటర్లు గతంలోనే మూసి కళ్యాణమండపాలుగా మార్చిన సంగతి తెలిసిందే. ఇదే మాదిరిగా తెలంగాణలోని హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లోని ఓ థియేటర్ మూసేసి కళ్యాణ మండపంగా మార్చిన సంగతి తెలిసిందే. అలాగే హైదరాబాద్ శివార్లలో వున్న థియేటర్లు కూడా అప్పట్లో అలానే చేశారు.
ఇప్పుడు ప్రత్యేకంగా ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుపట్ల ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా సిబ్బందికి జీతాలు ఇవ్వలేక సతమతవుతుంటే ఇప్పుడు అనుకోని ఉపద్రవంగా ప్రభుత్వం వైఖరి మారడం శోచనీయమని పేర్కొంటున్నారు. ఎగ్జిబిటర్ సెక్టార్ కార్యదర్శి సురేందర్ రెడ్డి ఈ విషయమై స్పందిస్తూ, రాబోయే రోజుల్లో వినోదం ప్రేక్షకులకు దూరం అవుతుందనీ, ఇదంతా కేవలం ఓటీటీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే అనిపిస్తుందనీ, సినీ పరిశ్రమలో ఏదో తెలీని గందరగోళం వుందని అంటున్నారు.
ఆంధ్రలో టిక్కట్ రేటు అమలాపురం వంటి చాలా ప్రాంతాల్లో 15, 10,5 రూపాయలుగా ప్రభుత్వం ప్రకటించడం థియేటర్లను లేకుండా చేయడమేనని వాపోతున్నారు. ఇదంతా ప్రైవేట్ సంస్థలైన ఓటీటీకి మార్కెట్‌వైపు ప్రేక్షకులను మళ్ళించడమేనని అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు.