ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 25 డిశెంబరు 2021 (12:29 IST)

దుర్గమ్మ సేవ‌లో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ

ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గమ్మను భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సతీసమేతంగా శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయం వద్ద జస్టిస్ వెంకట రమణ దంపతులను  రాష్ట్ర సమాచార పౌరసంబందాల శాఖామాత్యులు పేర్ని వెంకటరామయ్య (నాని) స్వాగతం పలికారు. జస్టిస్ వెంకటరమణ దంపతులను ఆలయ మర్యాదలతో  ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సోమినాయుడు ఆలయ ఈ ఓ భ్రమరాంబ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
 
 
వెంకటరమణ దంపతులకు అర్చకులు అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితుల వెంకటరమణ దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని, తీర్ధ,ప్రసాదాలను అందజేశారు. 
 
 
సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి వెంట ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణా హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ , తెలంగాణా హైకోర్టు జడ్జి లలిత కన్నెగంటి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణా హైకోర్ట్ రిజిస్ట్రార్లు , విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి  శ్రీమతి వాణిమోహన్, కమీషనర్ హరిజవహర్ లాల్, జిల్లా కలెక్టర్ జె.నివాస్, నగర పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా పాల్గొన్నారు.