శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 4 జూన్ 2019 (19:36 IST)

విఐపిలు సంవత్సరానికి ఒకసారి తిరుమలకు రండి: ఉపరాష్ట్రపతి సూచన(వీడియో)

తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దర్సనానంతరం ఉపరాష్ట్రపతి మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ మానవాళి సుఖఃసంతోషాలతో జీవించాలని.., ఘర్షణలు, అత్యాచారాలు,అవినీతి, అసమానతలు లేని మార్గాన్ని చూపించాల్సిందిగా స్వామి వారిని ప్రార్ధించానని చెప్పారు.
 
రాజకీయాల్లో లేను, భవిష్యత్‌లో రాజకీయాల్లోకి రాను, ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేస్తున్న అనేక సమావేశాలకు కూడా వెళ్తున్నానన్నారు. ప్రపంచ స్థాయిలో  అసమానతలు తగ్గి..అరాచకం పై గట్టి పాదం మోపే విధంగా ప్రజా అభిప్రాయాన్ని సేకరించే విధంగా శక్తిని ఇవ్వమని స్వామిని వేడుకున్నానని చెప్పిన ఉపరాష్ట్రపతి..భారతదేశం మ౦చి అభివృద్ధి పథంలో నడుస్తోంది. అభివృద్ధి ఫలాలు అందరికి అందేవిధంగా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
 
ప్రకృతి కరుణించి, సకాలంలో వర్షం కురిసి, ప్రకృతి విపత్తులు లేకుండా ఉండాలని కోరుకున్నానని.. ప్రముఖులు సంవత్సరానికి ఒక్కమారు దర్శించుకుంటే మరింత మంది సామాన్య భక్తులకి దర్శన భాగ్యం కల్పించిన వారు అవుతామని చెప్పారు వెంకయ్య నాయుడు. వీడియో చూడండి.