గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (09:58 IST)

ఆస్ట్రేలియాలో చలికి ఊపిరాడక మృతి చెందిన వైజాగ్ విద్యార్థి!

ఆస్ట్రేలియాలో వైజాగ్‌కు చెందిన విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం వేళ వాకింగ్‌కు వెళ్లగా చలికి ఊపిరాడకపోవడంతో చనిపోయాడు.  ఈ విషయం తెలుసిన ఆ మృతుని కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖ పారిశ్రామిక ప్రాంతం గుల్లలపాలెం వుడా కాలనీకి చెందిన ప్రసంగి శ్రీనివాసరావు, కవిత దంపతుల పెద్ద కుమారుడు చెన్నకేశవ సాయి (20) మెల్‌బోర్న్‌లో డిగ్రీ చదివేందుకు వెళ్లారు. 
 
ప్రసుత్తం బీఎస్సీ రెండో ఏడాది చదువుతున్న చెన్నకేశవ సాయి ఈ నెల 16న అక్కడి పార్కులో ఉదయపు నడకకు వెళ్లారు. తీవ్రమైన చలివల్ల ఊపిరి అందక అస్వస్థతకుగురై కుప్పకూలిపోయారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో అటువైపు ఎవరూ రాకపోయేసరికి మరణించారు. 
 
అయితే, అటువైపు మూడు రోజుల వరకు ఏ ఒక్కరూ రాకపోవడంతో ఈ విషయం ఎవరికీ తెలియలేదు. బంధువులు, స్నేహితులు గాలింపు చేపట్టడంతో విషయం బయటపడింది. వెంటనే వారు చెన్నకేశవ సాయిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆదివారం విశాఖలోని స్వగృహానికి తీసుకొచ్చిన మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.