గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 అక్టోబరు 2021 (11:23 IST)

విజయనగరం వైసీపీలో తీవ్ర విషాదం.. అంబటి అనిల్ గుండెపోటుతో మృతి

విజయనగరం వైసీపీ పార్టీ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అంబటి అనిల్ గుండె పోటుతో మృతి చెందాడు. ఉన్నట్టు ఉండి.. నిన్న రాత్రి ఇంట్లో పడిపోయిన జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్మన్‌ అంబటి అనిల్‌ ను..విజయ నగరం లోని ఓ ప్రముఖ ఆస్పత్రి కి కుటుంబ సభ్యులు తరలించినట్లు సమచారం అందుతోంది.
 
అయితే.. అంబటి అనిల్‌ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. విజయ నగరం జిల్లా పరిషత్ లో అందరి కన్నా చిన్న వయస్సున్న జడ్పిటిసిగా అంబటి అనిల్‌ గుర్తింపు పొందాడు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మేనల్లుడే అంబటి అనీల్. 
 
అనీల్ సొంతూరు సాలూరు మండలం సన్యాసిరాజుపేట. ఇక జడ్పి వైస్ చైర్మన్ అంబటి అనీల్ మృతి తో ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో వెళ్లారు. అటు అంబటి అనిల్‌ మృతి పట్ల వైసిపి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.