సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (19:47 IST)

చెల్లి శీలంపై కాటేసిన అన్న... ఎక్కడ?

విజయనగరం జిల్లాలో ఘోరం జరిగింది. అన్న అనే పదానికే మచ్చతెచ్చాడో కామాంధుడు. సమాజంలో వావివరుసలు మరచిపోయి తోడబుట్టిన చెల్లిపైనే లైంగికదాడికి పాల్పడ్డాడు. తాజాగా జరిగిన ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని డెంకాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదోతరగతి చదువుతోంది. ఆమెతో పెదనాన్న కుమారుడు చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలో ఆరునెలల క్రితం ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికఫై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమెను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీశానని ఎవరికైనా చెప్తే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అల్లరుపాలు చేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆమె తనకు జరిగిన అన్యాయంపై నోరు మెదపలేదు. 
 
అయితే, మూడు నెలల క్రితం బాలికకు అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమెకు పరీక్షలు చేయగా ఆమె మూడు గర్భవతి అని అప్పటికే అబార్షన్ అయిందని వైద్యులు బాంబులాంటి వార్తను చెప్పారు. 
 
దీనిపై బాలికను నిలదీయడంతో పెదనాన్న కుమారుడే ఈ పనిచేశాడని బాలిక బోరున విలపించింది. అయితే బయటకు చెప్తే పరువుపోతుందని ఎవరికీ చెప్పొద్దంటూ బంధువులు, కుటుంబ సభ్యులు బాలిక తల్లిదండ్రులకు సూచించారు. ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయిన తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.