సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (10:25 IST)

రాజకీయ కక్షల నేపథ్యం : ఇళ్లకు నిప్పు పెట్టిన వ్యక్తులు

ఏపీలోని విజయనగరం జిల్లాలో అగ్నిప్రమాదం సంభవించింది. దత్తిరాజేరు మండలం వింద్యవాసిలో అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో పక్కనే ఉన్న మూడు ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. 
 
ఈ ప్రమాదంపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. సుమారు 9 లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్టు తెలుస్తోంది. అయితే రాజకీయ కక్షల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులే తమ ఇళ్లకు నిప్పు పెట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.