సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (10:14 IST)

విద్యార్థినిని గర్భవతి చేసిన ట్యూషన్ మాస్టార్

కామంతో కళ్లుమూసుకునిపోయిన ఓ ట్యూషన్ మాస్టర్.. తన వద్దకు వచ్చే విద్యార్థినిని గర్భవతిని చేశాడు. చదువు చెప్పాల్సిందిపోయి.. బాలికను గర్భవతిని చేశాడు. ఈ సంఘటన ఏపీలోని విజయనగరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన పదో తరగతి విద్యార్థిని(16) మూడేళ్ల నుంచి ఓ ట్యూషన్ సెంటర్‌కి వెళుతోంది. ఆ బాలికపై ట్యూషన్ మాస్టార్ కన్నుపడింది.
 
సమయం చూసి మిగిలిన విద్యార్థులంతా వెళ్లిపోయాక నీకు తెలివి లేదు, మేథాశక్తి పెంచుతాను, నీకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి అంటూ మాయమాటలు చెప్పి బాలికను లోబరుచుకున్నాడు. అయితే, గత కొన్ని రోజులుగా బాలిక సరిగా భోజనం చేయకపోవడంతో నీరసంగా ఉండసాగింది. దీంతో ఆ బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. 
 
వైద్యులు పరిశీలించి బాలిక గర్భవతి అని చెప్పారు. అప్పటికే బాలికకు ఎనిమిది నెలలు రావడం గమనార్హం. వెంటనే బాధితులు దిశ పోలీస్ స్టేషన్‌ని ఆశ్రయించారు. నిందితుడు చిన్నాను అదుపులోకి తీసుకున్నామని దిశ డీఎస్పీ త్రినాథ్ తెలిపారు. నిందితుడికి అప్పటికే పెళ్లైంది. భార్య కూడా ఉండటం గమనార్హం.