రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలనుంది.. జయప్రద ఆకాంక్ష
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోకి బీజేపీ నాయకురాలు, సినీయర్ నటి జయప్రద రానున్నారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. తెలుగు బిడ్డగా ఏపీకి కానీ, తెలంగాణకు కానీ రావాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఇక్కడ ఉండి పార్టీ కార్యకలాపాల్లో పాలుపంచుకోవాలనుకుంటున్నానని తెలిపారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో ఉండటం కంటే... తెలుగు రాష్ట్రాల్లో ఉండటానికే తాను ప్రాధాన్యతను ఇస్తానని జయప్రద తెలిపారు. ప్రస్తుతం తాను ఉత్తరప్రదేశ్ క్యాడర్‌లో ఉన్నానని... తాను ఇక్కడకు రావాలంటే పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.