శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 మే 2022 (22:03 IST)

6జీ నెట్‌వర్క్‌ పనిచేయడం ప్రారంభిస్తే.. స్మార్ట్‌ఫోన్లకు కాలం చెల్లినట్లే?

6G
6G
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు 6జీ నెట్‌వర్క్‌లకు సిద్ధమవుతుండగా భారత్ వంటి దేశాలు ఇంకా 5జీ నెట్‌వర్క్‌లో అడుగుపెట్టలేదు. వచ్చే ఏడాది ఆరంభంలో 5జీ స్పెక్ట్రం వేలం జరగనుండగా ఆపై కమర్షియల్‌గా 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చే ప్రక్రియ షురూ కానుంది.
 
ఈ నేపథ్యంలో 2030 నాటికి 6జీ అందుబాటులోకి వస్తే మనం వాడే స్మార్ట్ ఫోన్లకు కాలం చెల్లుతుందని నోకియా సీఈఓ పెకా లుండ్‌బెర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 6జీ మొబైల్ నెట్‌వర్క్‌లు పనిచేయడం ప్రారంభిస్తే.. స్మార్ట్‌ఫోన్లు పనికిరావని, అప్పటికి ఇవి కామన్ ఇంటర్‌ఫేస్‌లో ఉండవని లుండ్‌బెర్గ్ వ్యాఖ్యానించారు.  
 
వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో లుండ్‌బెర్గ్ మాట్లాడుతూ.. 6జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే కామన్ ఇంటర్‌ఫేస్‌గా అందరూ ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌ల స్ధానంలో ఏ డివైజ్ ముందుకొస్తుందనే విషయమై ఆయన స్పష్టత ఇవ్వలేదు.