గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (12:56 IST)

అమెరికా, జపాన్​ మార్కెట్​లోకి గూగుల్ పిక్సెల్ 5a 5G

Pixel 5a 5G
టెక్​ దిగ్గజం గూగుల్​ నుంచి విడుదలయ్యే పిక్సెల్​ స్మార్ట్​ఫోన్లకు విపరీతమైన డిమాండ్​ ఉంటుంది. ప్రీమియం సెగ్మెంట్​లో విడుదలయ్యే ఈ ఫోన్లు హాట్​కేకుల్లా అమ్ముడవుతాయి. అలాంటి గూగుల్​ పిక్సెల్​ సిరీస్​లో ఇప్పుడు ఓ సరికొత్త స్మార్ట్​ఫోన్​ విడుదలైంది. గూగుల్ పిక్సెల్ 5a 5G.. అమెరికా, జపాన్​ మార్కెట్​లోకి రిలీజ్​ అయ్యింది. కాగా, భారత్​తో సహా గ్లోబల్​ మార్కెట్​లోకి ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై గూగుల్​ ఎటువంటి స్పష్టతనివ్వలేదు. 
 
గూగుల్​ పిక్సెల్​ 5ఎ 5జిలో ఇతర ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల కంటే అద్భుతమైన ఫీచర్లను అందించింది. గూగుల్​ పిక్సెల్ 5ఎ 5జి స్మార్ట్​ఫోన్​ కొత్త "మోస్ట్లీ బ్లాక్" కలర్‌ ఆప్షన్​లో లభిస్తుంది. దీని యూనిబాడీ అల్యూమినియం డిజైన్‌తో వస్తుంది. 
 
పిక్సెల్ 5a 5G ఫోన్‌లో డ్యుయల్ కెమెరా సెటప్​ ఉంటుంది. 12 MP మెయిన్ కెమెరా, 16 MP అల్ట్రా-వైడ్ కెమెరా వంటివి అందించింది. సెల్ఫీలు, వీడియో కాలింగ్​ కోసం ప్రత్యేకంగా 8 MP స్నాపర్ కెమెరాను చేర్చింది. 
 
కెమెరా ఫీచర్లన్నీ 4ఎ, 5ఎ డివైజ్‌లలో ఒకే రకంగా ఉన్నప్పటికీ.. బ్యాటరీ సామర్థ్యంలో మాత్రం తేడాలున్నాయి. పిక్సెల్​ 4 ఎలో 3,885 mAh బ్యాటరీని అందించగా.. పిక్సెల్ 5 ఎ డివైజ్‌లో 4,680 ఎంఏహెచ్ బ్యాటరీని చేర్చింది. ఈ బ్యాటరీలు 18W ఫాస్ట్ ఛార్జింగ్​కు మద్ధతిస్తాయి. ఈ స్మార్ట్​ఫోన్​​ ఆండ్రాయిడ్ 11 ఓఎస్​పై పని చేస్తుంది.