మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (13:22 IST)

ఆది సాయికుమార్ బ్లాక్ టీజ‌ర్ కు స్పంద‌న‌

adi saikumar-black
మ‌హంకాళీ మూవీస్ బ్యాన‌ర్ పై మ‌హంకాళీ దివాక‌ర్ నిర్మాత‌గా ఆది సాయికుమార్, `ఆట‌గాళ్లు` ఫేమ్ ద‌ర్ష‌ణ బానీక్ జంట‌గా జీబి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న మూవీ బ్లాక్. బ్లాక్ అనే టైటిల్ ఈ సినిమాను ఖ‌రారు చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఈ ప్రాజెక్ట్ పై అటు సాధార‌ణ ప్రేక్ష‌కుల్లో ఇటు ట్రెండ్ ఇండ‌స్ట్రీ ట్రేడ్ వ‌ర్గాలో ఓ అస‌క్తి  క్రియేట్ అయింది. దాంతో పాటే‌ ఆది సాయికుమార్ ఇంటెన్స్ లుక్స్ తో విడుద‌లైన బ్లాక్ ఫ‌స్ట్ లుక్ పోస్టర్ కి హ్యూజ్ రెస్పాన్ ల‌భించింది. 
 
ఈ నేప‌థ్యంలో తాజాగా విడుద‌ల చేసిన బ్లాక్ టీజ‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది, ఆది సాయికుమార్ ప‌లికిన సంభాష‌ణ‌లు, ప‌లికించిన హావ‌భావాలతో పాటు ఈ టీజ‌ర్ లో ఉన్న యాక్ష‌న్ షాట్స్ కి అనూహ్య ల‌భిస్తోంది. ఫుల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌ట్స్ తో రిలీజైన ఈ మూవీ టీజ‌ర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో ఆమ‌ని, బిగ్ బాస్ ఫేమ్ కౌశ‌ల్ మందా, పృధ్వి రాజ్, స‌త్యం రాజేశ్, తాగుబోతు ర‌మేశ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే భారీ రేంజ్ లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలిపారు. మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి, ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుద‌లవుతుంది.
 
న‌టీన‌టులు- ఆదిసాయికుమార్, ద‌ర్శ‌న్ బానిక్, ఆమ‌ని, సూర్య‌, కౌశ‌ల్ మందా, పృధ్వి రాజ్, స‌త్యం రాజేశ్, తాగుబోతు ర‌మేశ్, ఆనంద్ చ‌క్ర‌పాణి, మందునంద‌న్ త‌దిత‌రులు