మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 జులై 2021 (17:40 IST)

కరోనా వైరస్ సోకలేదు.. కానీ బ్లాక్ ఫంగస్ సోకింది.. ఎలా?

కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. ఈ వైరస్ ఏ రూపంలో దాడి చేస్తుందో తెలియని అయోమయ స్థితిలో ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా, కరోనా వివిధ వేరియంట్లుగా రూపాంతరం చెందింది. ఇలాంటి వాటిలో బ్లాక్ ఫంగస్ ఒకటి. ఇది సోకిన బాధితులు ప్రాణగండం నుంచి తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కరోనా వైరస్ సోకకుండానే కొందరికి బ్లాక్ ఫంగస్ సోకింది. 
 
క‌రోనా సెకండ్ వేవ్‌ నడిచిన మొత్తం మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో జైపూర్‌లో 3,471 బ్లాక్ ఫంగ‌స్ కేసులు న‌మోదు కాగా అందులో 477 మందికి అస‌లు క‌రోనా వైర‌సే సోక‌లేద‌ని వెల్ల‌డైంది. అంటే మొత్తం బ్లాక్ ఫంగ‌స్ కేసుల్లో 14 శాతం కేసుల‌కు కరోనా హిస్ట‌రీ లేదన్న‌మాట‌. దాంతో వైద్యులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇలా ఎందుకు జ‌రుగుతుందనే విష‌యంలో స‌మ‌గ్ర అధ్య‌య‌నం జ‌రగాల్సి అవ‌స‌రం ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు.
 
మరోవైపు, కరోనా వచ్చి తగ్గిపోయిన డయాబెటిస్ పేషెంట్లలోనే బ్లాక్ ఫంగస్ బయటపడుతోంది. అయితే, తాజా పరిశోధనలో మాత్రం కరోనా వైరస్ సోకకపోయినప్పటికీ బ్లాక్ ఫంగస్ వస్తున్నట్లు తెలుస్తోంది. సాధార‌ణంగా క‌రోనా సోకిన వ్య‌క్తి డ‌యాబెటిక్ పేషెంట్ అయితే, ఆ వ్య‌క్తిలో షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపు త‌ప్పుతాయి. దాంతో వ్యాధినిరోధ‌క శ‌క్తి బాగా త‌గ్గిపోయి బ్లాక్ ఫంగస్ అటాక్ అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.