శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (15:47 IST)

ఆలుగడ్డ పచ్చిపులుసు తిన్న విద్యార్థినులకు అస్వస్థత

భోజనం వికటించి విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన వరంగల్ నగరంలో వెలుగుచూసింది. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పరం గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల కు చెందిన విద్యార్థులను రాత్రి  చేసిన భోజనం వికటించడంతో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు విరోచనాలు కావడంతో వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
వసతి గృహంలో విద్యార్థులకు రాత్రి భోజన సమయంలో ఆలుగడ్డ పచ్చిపులుసు తిన్నామని రాత్రి నుంచి అందరికీ విరోచనాలు అవుతున్నాయని విద్యార్థినిలు తెలిపారు విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో వసతి గృహం సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.