శనివారం, 5 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (09:12 IST)

కేంద్రమంత్రి ప్రకటనపై బొత్స ఏంచెబుతాడు?: టీడీపీ

టిడ్కోఇళ్లపై ఎల్లోమీడియా దుష్ప్రచారంచేస్తోందని గతంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారని, దానితోపాటు రాష్ట్రానికి 7లక్షల ఇళ్లు మంజూరైతే, వాటిలో 51వేలనే గతప్రభుత్వం పూర్తిచేసిందని కూడా అబద్ధాలుచెప్పారని, కానీ కేంద్రగృహనిర్మాణమంత్రి హర్డీప్ సింగ్ పురి నిన్న రాజ్యసభలో చెప్పిన సమాచారంతో ఏపీప్రభుత్వం, మంత్రి ఇప్పటివరకు టిడ్కోఇళ్లపై చేస్తున్నది దుష్ర్పచారమని తేలిపోయిందని టీడీపీ కేంద్రకార్యాలయ కార్యదర్శి, పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పష్టంచేశారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జూలై 30, 2021వరకు కూడా రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి బొత్స నిరాధారమైన ఆరోపణలు చేస్తూనేఉన్నాడని, కానీ కేంద్రమంత్రి సమాధానంతో అవన్నీ పటాపంచలనీ తేలిపోయిందన్నారు. ఏపీప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన సమాచారం ఆధారంగానే తాను మాట్లాడుతున్నాననికూడా కేంద్రమంత్రి చెప్పడం జరిగిందన్నారు. 

రాష్ట్రానికి 4లక్షల54వేల706 టిడ్కోఇళ్లను కేంద్రం రాష్ట్రానికి మంజూరుచేస్తే, వాటిలో 3లక్షల13వేల832 ఇళ్లు గ్రౌండ్ అయ్యాయని, వాటిలో 45,830 ఇళ్లను స్థలాభావం వల్ల నిర్మించలేకపోయారని, మిగిలిన 2లక్షల పైచిలుకుఇళ్ల నిర్మాణం పూర్తైందని, వాటిలో 5,574 ఇళ్లను లబ్ధిదారులకు కూడా కేటాయించడం జరిగిందని కేంత్రమంత్రి చెప్పారన్నారు. రాజ్యసభలో కేంద్రమంత్రి చెప్పిన సమాచారం ఒకలా ఉంటే, మంత్రి బొత్స కేవలం 51లక్షల ఇళ్లే పూర్తయ్యాయని చెప్పడం సిగ్గుచేటన్నారు.

మంత్రి బొత్సకు అబద్ధాలు చెప్పడానికి హద్దూపద్దూ లేకుండా పోయిందన్నారు.  పేదలకు మంచి ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న ఉద్దేశంతో చంద్రబాబునాయుడి ప్రభుత్వం ఇంటి విస్తీర్ణాన్ని పెంచడంతోపాటు, ప్రభుత్వమిచ్చేసబ్సిడీనికూడా పెంచడం జరిగిందన్నారు. కేంద్రప్రభుత్వం రూ.లక్షా50వేలిస్తే, టీడీపీప్రభుత్వం రూ.లక్షా50వేలతోపాటు, లబ్ధిదారులకు బ్యాంకులనుంచి రూ.2లక్షల65వేల వరకు రుణం అందించేలాచూసిందని, ఆ రుణానికి ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చిందన్నారు. 

300 చదరపు అడుగులవి లక్షా47వేలు, 365 చదరపు అడుగులవి 44వేలు, 400 చదరపు అడుగులఇళ్లు 74వేలను గతప్రభుత్వహయాంలోనే పూర్తిచేసిందని అశోక్ బాబు తెలిపారు. టీడీపీప్రభుత్వం నిర్మించిన ఇళ్లపై అవినీతి ఆరోపణలు చేసిన వైసీపీప్రభుత్వం, కావాలనే ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించలేదన్నారు.

జగన్ ప్రభుత్వం టీడీపీహాయాంలో జరిగినఇళ్లనిర్మాణంపై చేసిన అవినీతిఆరోపణలు, కేటాయించిన, పూర్తైన ఇళ్లసమాచారంపై చెప్పిన తప్పుడులెక్కలను కేంద్రమంత్రి నిన్నరాజ్యసభలో పటాపంచలు చేశాడన్నారు. కేంద్రమంత్రి కేవలం సమాచారంతో సరిపెట్టకుండా, పూర్తి వివరాలతో స్పష్టమైన స్టేట్ మెంట్   ఇచ్చాడన్నారు. కేంద్రమంత్రి తనస్టేట్మెంట్ లో చాలాస్పష్టంగా తాను చెబుతున్న సమాచారమంతా, రాష్ట్రప్రభుత్వమిచ్చిన సమాచారంప్రకారమే చెప్పారన్నారు.

లబ్దిదారులు కట్టాల్సిన వాటాతాలూకా  సొమ్మతాలూకా మొత్తం చెల్లించనందునే తాము ఇళ్లను కేటాయించలేదని కూడా వైసీపీప్రభుత్వం కేంద్రానికి సమాచారమిచ్చిందని కూడా కేంద్రమంత్రి చెప్పడం జరిగిందన్నారు. అంటే గతంలో బొత్స చెప్పిన ఇళ్లనిర్మాణంలో అవినీతి జరగడమనేది పచ్చి అబద్ధమని కేంద్రమంత్రి మాటలతో తేలిపోయిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలలో పూర్తైన 2లక్షలఇళ్లలో లబ్ధిదారులవాటా తాలూకా సొమ్ము పెండింగ్ లోఉందని ప్రభుత్వం ఎలా చెబుతుందన్నారు.

ఇళ్లనిర్మాణప్రదేశాలకు సరైన రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించలేదని కూడా ఏపీప్రభుత్వంచెప్పిందన్నారు. రెండేళ్లనుంచి పేదలు నివాసముండే ఇళ్లకు రోడ్లు, నీటిసౌకర్యం, విద్యుత్ సౌకర్యం కల్పించకుండా జగన్ ప్రభుత్వం ఏంచేసిందన్నారు? 355 చదరపు అడుగుల్లో ఇల్లు కట్టాలంటే జాతీయసగటు ప్రకారం , చదరపు అడుగుకి రూ.2,542లు అవుతుందని కేంద్రమే చెప్పిందన్నారు.

టీడీపీప్రభుత్వం చదరపు అడుగుకి రూ.1830లు మాత్రమే చెల్లించిందన్నారు. కానీ గతంలో బొత్స రూ.2,300లు చదరపు అడుగుకి చెల్లించారని విషప్రచారంచేశాడన్నారు. రూ.1830ల సొమ్ముతోనే ఇళ్లనిర్మాణానికి అవసరమైన రోడ్లనుకూడా కాంట్రాక్ట్ సంస్థే వేయాల్సి ఉంటుందన్నారు. మంచి టాయ్ లెట్స్, తాగునీరు, రోడ్లు, విద్యుత్ సౌకర్యాలన్నీ కల్పించి నిర్మించడం జరిగందన్నారు. దానికితోడుఇళ్ల నిర్మాణం కోసం టీడీపీప్రభుత్వం షీర్ వాల్ టెక్నాలజీని ఉపయోగించిందన్నారు.

పగలే చంద్రుడిని చూశామనేలా పచ్చి అబద్ధాలు చెప్పేస్థాయికి జగన్ ప్రభుత్వం దిగజారిందని, ఇళ్లనిర్మాణంపై కేంద్రప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై మంత్రి బొత్స ఏంచెబుతారో చెప్పాలన్నారు. టీడీపీ హాయాంలో పూర్తైన 2లక్షల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా వారిని వేధించడంతోపాటు, నిర్మించాల్సిన ఇళ్లను కూడా ఈ ప్రభుత్వం రద్దుచేసిందన్నారు.

గతప్రభుత్వంహాయాంలో కేంద్రంనుంచి వచ్చిన ఇళ్లనురద్దుచేసిన జగన్ ప్రభుత్వం, తన బ్రాండ్ కోసం ఇళ్లస్థలాలపంపిణీ పేరుతో, ఎందుకూపనికిరాని ప్రాంతాల్లో సెంటుభూమిని పేదలకు  పంచిందన్నారు. రాబోయే రెండేళ్లలో జగనన్న ప్రభుత్వం 28లక్షల32వేలఇళ్లు కడుతున్నారనికూడా గతంలో బొత్స చెప్పడం జరిగిందన్నారు. అదేసయమంలో చంద్రబాబునాయుడి హాయాంలో కేవలం 6లక్షలఇళ్లను మాత్రమే కట్టారనికూడా చెప్పారన్నారు. 

టీడీపీహాయాంలో ఎన్నిఇళ్లను కట్టారో కేంద్రమే చెప్పిందని, పాతఇందిరమ్మ గృహాల పూర్తికి నిధులివ్వడంతోపాటు, మొత్తం 10లక్షలకు పైగాఇళ్లను పూర్తిచేయడం జరిగిందన్నారు. పేదలకోసం నిర్మించే ఇళ్లవిస్తీర్ణాన్ని కూడా టీడీపీప్రభుత్వం పెంచిందన్నారు. టీడీపీహాయాంలో నిర్మించిన ఇళ్లపై వైసీపీప్రభుత్వం చేసిందంతా  దుష్ప్రచారమని కేంద్రమంత్రి సమాధానంతోనే తేలిపోయిందన్నారు.

355 చదరపు అడుగుల ఇంటినిర్మాణానికి మొత్తం రూ.9లక్షలవుతుందని, చదరపు అడుగునిర్మాణానికి  రూ.2,542 వరకు ఖర్చవుతుందని జాతీయసగటుతో పోల్చిమరీ కేంద్రం చెప్పిందన్నారు. దానికంటే తగ్గితే మెరుగ్గానే నిర్మాణం జరగిందని భావించవచ్చని, ఎక్కువైతే మాత్రం అవినీతిజరిగిందని భావించాల్సి ఉంటుందని కూడా కేంద్రం చెప్పిందన్నారు. 

చదరపు అడుగు నిర్మాణంపై తెలంగాణకు, ఏపీకి తేడారావడానికి షీర్ వాల్ టెక్నాలజీ కారణమని, దానితోపాటు, నిర్మాణానంతరం వాడిన సామగ్రిలోకూడా వ్యత్యాసం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇళ్లనిర్మాణమంతా షీర్ వాల్ టెక్నాలజీతోనే జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అధునాతన, విలాసవంతమైన భవనాలలో నివసిస్తూ, పేదలు మాత్రం చాలీచాలని జాగాల్లో , వసతులులేని ఇళ్లలో ఉండాలనిచెప్పడం దారుణమని అశోక్ బాబు ఆగ్రహంవ్యక్తంచేశారు.

సెంటు భూమిపేరుతో ప్రభుత్వం 30లక్షలప్లాట్లను ఇచ్చిందని, దానిపై వైసీపీఎమ్మెల్యేనే ఆస్థలం ఎందుకుపనికొస్తుందని ప్రశ్నించడంజరిగిందని, శోభనానికి కూడాపనికిరావని చెప్పడంజరిగిందన్నారు. జగన్ ప్రభుత్వం తొలుతు ఇళ్లను నిర్మించిఇస్తుందనిచెప్పారని, ఇప్పుడేమో లబ్ధిదారులే నిర్మించకోవాలని, ప్రభుత్వ మెటీరియల్ మాత్రమే ఇస్తుందని చెబుతోందన్నారు.

సెంటుపట్టా భూముల్లో జరిగిన అవినీతి సామాన్యమైందికాదని, ప్రభుత్వమిచ్చిన ఇళ్లస్థలాలు అన్నీ నీటి మధ్యలోనే ఉన్నాయన్నారు. టీడీపీహయాంలో పేదలకోసం నిర్మించినఇళ్లపై, వైసీపీప్రభుత్వంచెప్పేవన్నీ అబద్ధాలేనని రాజ్యసభలో కేంద్రమంత్రి ఇచ్చినసమాధానంతోనే తేలిపోయిందన్నారు. జగనన్న కాలనీను ప్రభుత్వం నీళ్లలో నిర్మిస్తుందా..లేక నీటిపై తేలియాడేలా నిర్మిస్తుందా అనే సందేహం ప్రజలందరిలోనూ ఉందన్నారు. 

తప్పుడు ఆరోపణలు చేసిన బొత్స తక్షణమే బహిరంగ క్షమాపణచెప్పాలని,  లేకుంటే న్యాయపోరాటంచేసైనా సరే, ఆయనతో నిజాలు చెప్పిస్తామని అశోక్ బాబు తేల్చిచెప్పారు.