శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (09:10 IST)

మున్సిప‌ల్ కమిషనర్లు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి బొత్స

రాష్ట్రంలో గత రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షా వల్ల  పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పురపాలక శాఖ కమిషనర్లను ఆదేశించారు. 
 
వర్షాల నేపథ్యంలో మున్సిప‌ల్ కమినషర్లు అందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎటు వంటి అపారిశుద్య పరిస్థితులు, అంటు వ్యాధులు ప్రభలటానికి ఆస్కారం లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. త్రాగునీటి వనరులు కలుషితం కాకుండా చూడాలని, ఆయా వనరులు అన్నింటినీ క్లోరినేషన్ చేయించాలన్నారు. 

పట్టణ ప్రాంతాల్లో మేన్ హోల్స్ అన్నీ పూర్తిగా మూసి ఉండే విధంగా చూడాలని, పారిశుద్ద్య పనుల నిర్వహణలో ఎటు వంటి రాజీలేకుండా ప్రణాళికా బద్దంగా తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమినర్లను మంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్పరెన్సులో ముఖ్యమంత్రి జారీచేసిన ఆదేశాల మేరకు అన్ని మున్సిప‌ల్  కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలని కమిషనర్లను మంత్రి ఆదేశించారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రాంతాల్లోని లోతట్టు  ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ఎటు వంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.  ముంపుకి ఆస్కారం లేకుండా వరద, మురుగునీటి పారుదల కాలువలను ఎప్పటి కప్పుడు శుభ్రపర్చే విధంగా చర్యలు తీసుకోవాలని,  అవసరం మేరకు మోటార్లతో  వరద నీటిని పంపింగ్ చేయించి  కాలువల్లోకి మళ్లించాలని సూచించారు. 

ముంపుకు గురిఅయ్యే ప్రాంతాల నుండి ముందుగానే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, అవసరమైన వసతి,భోజన, వైద్య సధుపాయాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజక్టుల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని కమిషనర్లను మంత్రి ఆదేశించారు. 

ప్రతి పార్లమెంటరీ నియోజక వర్గానికి ఇప్పటికే విద్యుత్, గ్యాస్ ఆధారిత  దహనవాటికలను మంజూరు చేయడం జరిగిందని, వాటి పనులను అన్నింటినీ నెల రోజుల  కాలవ్యవధిలో  పూర్తిచేయాలని ఆదేశించారు.

నవరత్నాల్లో భాగంగా పేదలు అందరికీ ఇళ్లు పథకం క్రింద ఏర్పాటు చేస్తున్న జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పనులను సాద్యమైనంత త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. ఇప్పటి వరకూ అపరిష్కృతంగా ఉన్న ఎల్.ఆర్.ఎస్. ధరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలన్నారు.