శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 1 ఏప్రియల్ 2021 (16:04 IST)

వేకెంట్ లాండ్ టాక్స్ 50 శాతంకు తగ్గించాలి: మంత్రి బొత్సను కలిసిన క్రెడాయి ఎపి ఛాప్టర్ ప్రతినిధులు

భవన నిర్మాణ సమయంలో వేకెంట్ ల్యాండ్ టాక్స్ ( విఎల్ )ని 100 శాతం వసూలు చేస్తున్నారని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 శాతం పన్ను మాత్రమే వసూలు చేయాలని ఉందని ఆవిధంగా 50 శాతం మాత్రమే వసూలు చేసే విధంగా చూడాలని మునిసిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణను క్రెడాయ్ ఎపి ప్రతినిధులు కలిసి విజ్ఞప్తి చేశారు.
 
నగరంలోని మంత్రి నివాసంలో ఎంపి సత్యనారాయణతో కలిసి క్రెడాయ్ ఎపి ప్రతినిధులు కలిసిశారు. ఈ సందర్భంగా క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షులు బి.రాజా శ్రీనివాస్, ప్రదాన కార్యదర్శి కె.సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ వేకెంట్ ల్యాండ్ టాక్స్ 50 శాతం కడితే సరిపోతుందని ప్రభుత్వ జివో ఉందన్నారు. కాని 100 శాతం వసూలు చేస్తున్నారని దీనితో భవన నిర్మాణ రంగ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
 
ప్రభుత్వ జివో ప్రకారం 50 శాతం మాత్రమే పన్ను తీసుకునే విధంగా చూడాలని కోరారు. కరోనా కారణంగా భవన నిర్మాణాలు ఆగిపోయిన కారణంగా ప్లాన్ అప్రూవల్ తేదీ ముగిసిన ప్లాన్స్‌కి 1 సంవత్సరం పొడిగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బహుళ అంతస్తుల భవనాలకు సంబంధించి సెట్‌బ్యాక్‌ను తగ్గించాలని కోరారు. టిడిఆర్ బాండ్స్‌కు సంబంధించి పలు సమస్యలను ఎదుర్కొంటున్నామని వాటన్నింటినీ పరిష్కరించాలని తెలియచేశారు. కరోనా సందర్భంగా భవన నిర్మాణదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాబట్టి స్టాంపు డ్యూటీని తగ్గించాలని కోరారు. 
 
అనంతరం మంత్రి మాట్లాడుతూ సమస్యలను సిఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. మంత్రిని కలిసిన వారిలో క్రెడాయ్ ఎపి ఉపాధ్యక్షులు వై.వి. రమణరావు, పి.రాజశేఖరరావు, ఛాప్టర్ ట్రెజరర్ దాసరి రాంబాబు, పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా అఫైర్స్ ఆర్.వి.స్వామి, స్కిల్ డెవలప్మెంట్ ఛైర్మన్ జి.ఎస్.ఆర్. మోహన్‌రావు, క్రెడాయి సలహాదారుడు ఆళ్ల శివారెడ్డి, 13 జిల్లాల క్రెడాయి ప్రతినిధులు ఉన్నారు.