సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 3 సెప్టెంబరు 2020 (23:28 IST)

భార్య వేరొకరితో చనువుగా ఉంటోందని సెల్పీ వీడియో తీసుకుని భర్త....

ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య మరొకరితో సన్నిహితంగా ఉందని సెల్పీ వీడియో తీసుకొని, ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన గుంటూరులో సంచలనం రేపింది. వివరాలు పరిశీలిస్తే ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామానికి చెందిన గోపి రైల్వే ట్రాక్ పనుల్లో విధులు నిర్వహిస్తూ ఉంటాడు. అయితే భార్య మీద అనుమానంతో   పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
తన చావుకు తన భార్య, అత్త, మామ, సాయి అనే యువకుడు కారణం అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. గోపి మరణం తరువాత ఈ సెల్పీ వీడియో వెలుగులోకి వచ్చింది. గోపికి రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు కూడ పుట్టాడు. గత కొంత కాలంగా భార్య ప్రవర్తనలో మార్పును గమనించిన గోపి.. ఇదే విషయంమై భార్యతో పలు దఫాలుగా గొడవలు కూడపడ్డాడు.
 
ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి భార్య పుట్టింట్లో ఉంటుంది. వాలంటీర్‌గా పని చేస్తున్న భార్య, ఇటీవల సాయి అనే తోటి వాలంటీర్‌తో చనువుగా ఉంటుందని గోపి అనుమానం పెంచుకున్నాడు. యధావిధిగా రైల్వే ట్రాక్ పనులు కోసం తాడికొండ మండలం బందారుపల్లి వద్దకు వెళ్ళిన గోపి అక్కడ పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
 
తోటి కార్మికులు విషయాన్ని గుర్తించి ఆసుపత్రికి తరలించే లోగానే గోపి మృతి చెందాడు. తన ఆవేదన అంతా సెల్పీ వీడియెలో చెప్పుకున్న గోపి తీవ్ర మనోవేదనకు గురై చనిపోతున్నట్లు తెలిపాడు.