మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 13 అక్టోబరు 2020 (22:22 IST)

నా భర్త ఎప్పుడూ జెసీబీలు, ట్రాక్టర్లు తోలుకుంటూ తిరుగుతుంటాడు, అందుకే సూది మందుతో చంపించేసా

భర్తతో కాపురం చేయలేకపోయింది భార్య. తరచూ ఇంట్లో భర్త లేకపోవడం.. పనిమీద బయటకు తిరుగుతుండడంతో ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేకుండా పోయింది. పెళ్ళయి రెండు సంవత్సరాలు అవుతున్నా భర్త తనతో సంసార జీవితం సరిగ్గా చేయకపోవడంతో విరహం తట్టుకోలేకపోయింది. ఇక చేసేది లేక ఒక వైద్యుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ సంబంధాన్ని కొనసాగించేందుకు భర్తను చంపించేసింది.
 
ప్రకాశంజిల్లా కంభం అర్ధవీడు మండలం నాగులవరానికి చెందిన జగన్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపిస్తే అందులో అతనికి నరాల వీక్నెస్ ఇంజక్షన్ ఇచ్చి ఊపిరాడకుండా చంపేసినట్లు నిర్థారణ అయ్యింది.
 
భార్య రజినీని విచారించడం ప్రారంభించారు పోలీసులు. విచారణలో భార్య చెప్పిన సమాధానం చూసి ఆశ్చర్యపోయారు పోలీసులు. భర్త సంసారం సుఖం ఇవ్వలేదు. అందుకే మా ఇంటికి దగ్గరలో ఉన్న ఆర్ఎంపి డాక్టర్ వెంకరమణతో వివాహేతర సంబంధం పెట్టుకున్నా.
 
నా భర్త ఎప్పుడూ జెసీబీలు, ట్రాక్టర్లు తోలుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇంటి పట్టున ఉండడు. ఇంటికి వచ్చినా నన్ను పట్టించుకోడు. అందుకే అతడిని చంపించాను. నేనే డాక్టర్‌కు చెప్పాను. నరాల ఇంజక్షన్ ఇచ్చి చంపేయమన్నానని పోలీసులకు అసలు విషయాన్ని చెప్పేసింది.
 
అయితే జగన్ హత్య తరువాత డాక్టర్ వెంకటరమణ పరారయ్యాడు. ప్రస్తుతం నిందితురాలు రజినీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటరమణ కోసం గాలిస్తున్నారు.