అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన భార్య.. తిరుమల దర్శనమంటూ తీసుకొచ్చి నరికిన భర్త..?

Murder
జె| Last Modified శనివారం, 7 సెప్టెంబరు 2019 (11:29 IST)
పండంటి సంసారం. ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసేశారు. అయితే భర్త ఆలోచన పెడదారి పట్టింది. వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కట్టుకున్న భార్యను హింసించడం ప్రారంభించాడు. దీంతో ఇద్దరి మధ్యా గొడవలు తలెత్తాయి. ఇంకేముంది. భార్యను ఎలాగైనా వదిలించుకోవాలని ఒక పక్కా స్కెచ్ వేశాడు. భార్యను అతి దారుణంగా హత్య చేశాడు.

తమిళనాడు రాష్ట్రం చెన్నై సెంట్రల్ సమీపంలో నివాసముంటున్న మురుగన్, సింధియాలు గత నెల 22వ తేదీన తిరుపతిలోని శ్రీనివాసం ఎదురుగా ఉన్న సుప్రభాత్ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. 23వ తేదీ ఉదయం సింధియా రక్తపు మడుగులో కనిపించింది. అతి దారుణంగా ఎవరో చంపి పరారైనట్లు గుర్తించారు పోలీసులు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తే హత్య చేసి ఉండొచ్చన్న అనుమానంతో విచారణ ప్రారంభించారు. వివాహేతర సంబంధానికి తన భార్య అడ్డొస్తోందని ఎలాగైనా అడ్డు తొలగించికోవాలన్న ఉద్దేశంతో తిరుమల శ్రీవారిని దర్శించుకుందామని తిరుపతికి తీసుకొచ్చాడు.

తిరుపతిలోని ఒక ప్రైవేటు లాడ్జిలో గదిని అద్దెకు తీసుకుని 23వ తేదీ తిరుమలకు వెళదామని భార్యను నమ్మించాడు. నిద్రిస్తున్న సింధియా గొంతుపై కత్తితో అతి దారుణంగా నరికి చంపేశాడు. ఆ తరువాత గది తలుపులకు తాళాలు వేసి పరారయ్యాడు. గత 15 రోజుల నుంచి పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న తిరుపతి ఈస్ట్ పోలీసులు మీడియా ముందుంచారు.దీనిపై మరింత చదవండి :