శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (21:37 IST)

నా భర్త దాంపత్య జీవితానికి పనికిరాడు.. కృష్ణా నదిలో మహిళ దీక్ష

woman
తన భర్త దాంపత్య జీవితానికి పనికిరాడని తెలిసి కూడా తమ కుమారుడితో తనకు పెళ్లి చేసిన అత్తామామలపై కోడలు ఎదురుతిరిగింది. తన జీవితాన్ని నాశనం చేశారంటూ ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కృష్ణా నది పరివాహక ప్రాంతంలో సదరు మహిళ దీక్షకు దిగింది. 

 
అత్తింటివారి వేధింపుల నుండి కాపాడి తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ పుట్టింటివారితో కలిసి ఆమె నిరాహార దీక్ష చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తన పెళ్లి అయినప్పటి నుంచి తాను భర్తతో శరీరకంగా కలవలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.  అన్నీ తెలిసీ తన జీవితం నాశనం చేసే హక్కు వాళ్లకు లేదని చెప్పింది. 

 
ఈ మేరకు తన భర్తతో విడాకులు కావాలని అత్తమామలను అడగ్గా.. వాళ్లు గ్రామ పంచాయతీ పెద్దల సమక్షంలో రూ.15 లక్షలు నష్టపరిహారంగా ఇస్తామని హామీ ఇచ్చారని.. కానీ ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు బాధితురాలు వివరించింది. గతంలో ఒప్పుకున్న డబ్బులు ఇచ్చేంత వరకు తన ఆందోళన విరమించేది లేదని పేర్కొంది.