తోటి మహిళపై కక్ష.. ఐదుగురితో సామూహిక అత్యాచారం.. వీడియో తీసి..?
ఆఫీసులో పనిచేసే తోటి మహిళపై కక్ష తీర్చుకునేందుకు మరో మహిళ దారుణానికి పాల్పడింది. ఐదుగురు పురుషులతో ఆమెపై సామూహిక అత్యాచారం చేయించింది. అంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని వీడియో తీయించి బెదిరించసాగింది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని ఫరీదాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా ఓ మహిళ చేరింది. అక్కడే పని చేస్తున్న మరో మహిళ ఆమెపై కక్ష పెంచుకుంది. 2020లో ఓ రోజు ఆమెను పని చేస్తున్న హోటల్‌లకు పిలిపించింది.
మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించింది. దీంతో అది తాగిన బాధిత మహిళ స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆమెపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు.
ఈ తతంగాన్ని వీడియో తీసింది. అది చూపించి రెండేళ్లుగా నిందితులు ఆమెను బెదిరించి, అత్యాచారం చేస్తున్నారు. చివరికి విసిగిపోయిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేశారు.