1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (18:05 IST)

వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం..

knife
వరంగల్ నగరంలో ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. కాకతీయ వర్శిటీ విద్యార్థిని అనూషపై దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. 
 
వివరాల్లోకి వెళితే.. లక్నేపల్లికి చెందిన యువతి కాకతీయ వర్శిటీలో ఎంసీఏ చదువుతోంది. కొంతకాలంగా ప్రేమ పేరుతో  ఆ యువతిని ఉన్మాది వేధిస్తున్నాడు. శుక్రవారం ఉదయం యువతి ఇంటికి వెళ్లి కత్తితో ఆమెపై దాడి చేశాడు. 
 
విద్యార్థిని అనూష ఇంట్లో ఉండగా ఉన్మాది అజార్ ఆమె బెడ్ రూంలోకి వెళ్లి కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. దీంతో ఆమెను కుటుంబసభ్యులు హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. 
 
యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా నిందితుడు అజార్ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.