శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (17:10 IST)

వివాదంలో చిక్కుకున్న తెరాస ఎమ్మెల్యే తమ్ముడు

woman victim
తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్టేషన్ ఘన్‌పూర్ తెరాస శాసనసభ్యుడు, మాజీ మంత్రి తాటికొండ రాజయ్య సోదరుడు తాటికొండ సురేష్ వివాదంలో చిక్కుకున్నారు. తనను తాటికొండ సురేష్ లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ పిర్యాదు చేసింది. ఈ విషయం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ వివరాలను పరీశీలిస్తే, విజయలక్ష్మి, రమేష్ దంపతులు అనే దంపతులు తమ కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిలో ఇంటి నిర్మాణం కోసం చాలా ఏళ్ల క్రితమే పునాదులు వేశారు. అయితే, వాళ్ల పనులకు స్థానిక సర్పంచ్ తాటికొండ సురేష్ అడ్డుపడుతున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇంటి నిర్మాణం కోసం తాను గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లినప్పటికీ రూ.2 లక్షలను డిమాండ్  చేశారంటూ ఆరోపించారు. 
 
తమ వద్ద అంత డబ్బు లేదని చెప్పినా వినిపించుకోలేదని, ఆ సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపించారు. తన చేయి పట్టుకుని లాగాడని, లైంగికంగా వేధింపులకు గురిచేశాడంటూ ఆమె బోరున విలపిస్తూ చెప్పింది. దీనిపై జనగామ డీసీపీకి ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు.