శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (15:27 IST)

భార్యాభర్తల గొడవ.. కౌన్సిలింగ్ కోసం వెళ్లింది.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య

భార్యాభర్తల గొడవల కారణంగా విశాఖపట్నంలో ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన శ్రావణికి విశాఖకు చెందిన వినయ్ తో నాలుగు నెలల క్రితం వివాహం అయ్యింది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవలు జరుగుతుండటంతో శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో పోలీసులు ఇద్దరినీ గురువారం కౌన్సిలింగ్ నిమిత్తం స్టేషన్ కు పిలిపించారు. దంపతులకు ఎస్సై శ్రీనివాస్ కౌన్సిలింగ్ ఇస్తుండగా.. శ్రావణి ఫోన్ లో మాట్లాడుతూ బయటకు వెళ్లి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. 
 
ఈ ఘటనలో తీవ్రగాయాలకు పాలైన శ్రావణి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రావణి భర్తను అరెస్ట్ చేశారు.