గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2022 (12:40 IST)

ఈ నెల 27 నుంచి నెల్లూరు జిల్లాలో పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 17వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో ఏపీ జెన్‌కో థర్మల్ పవర్ స్టేషన్‌లోని మూడో యూనిట్‌ను సీఎం జగన్‌ జాతికి అంకిత చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఇతర కీలక నేతలు హాజరుకానున్నారు. 
 
థర్మల్ పవర్ ప్లాంట్‌లోని మూడో యూనిట్‌ పూర్తి సామర్థ్యం 800 మెగావాట్‌ల అని అధికారులు వెల్లడించారు. అయితే, సీఎం జగన్ పర్యటనను అడ్డుకుంటామని వామపక్షాలు నేతలు హెచ్చరిస్తున్నారు. 
 
జెన్‌కోను ప్రైవేటుపరం చేస్తున్నారన్న సమాచారం తమకు ఉందని ఆరోపిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన సీఎం జగన్ నెల్లూరుకు వస్తున్నారని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని జెన్‌కో ఎండీ శ్రీధర్ పరిశీలించారు.