Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

రాంగ్ కాల్ అంత పనిచేసింది.. యువతిపై అత్యాచారం.. ఎక్కడ?

Written By సెల్వి
Updated: బుధవారం, 4 మార్చి 2020 (11:46 IST)
రాంగ్ కాల్ ఓ యువతిపై అత్యాచారానికి కారణమైంది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దండేపల్లిలో గ్రామానికి చెందిన యువతి కనిపించడం లేదంటూ గత నెల 27న పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల విచారణలో రాంగ్‌కాల్ విషయం బయటపడింది.

సాయికృష్ణ అనే యువకుడి నుంచి రాంగ్ ఫోన్ కాల్ వచ్చిందని.. ఆ తర్వాత సాయికృష్ణ ఆ యువతికి పదేపదే ఫోన్ చేసి విసిగించేవాడని తేలింది. దీంతో ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు అతడిని మందలించారు. 
 
గత నెల 25న యువతికి మరోమారు ఫోన్ చేసిన యువకుడు మాట్లాడాలి రమ్మంటూ స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్దకు పిలిచాడు. అతడిని గట్టిగా మందలించేందుకు ఇదే సమయమని భావించిన యువతి అక్కడికి వెళ్లింది.

తన మిత్రుడు శివకృష్ణతో కలిసి అప్పటికే అక్కడికి ఆటోలో చేరుకున్న సాయికృష్ణ యువతి రాగానే బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని రామకృష్ణాపూర్‌‌లోని పాడుబడిన పాఠశాల భవనంలోకి తీసుకెళ్లాడు. 
 
ఆ భవనంలో ఆమెపై అత్యాచారం జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ అఘాయిత్యం జరిగింది. అక్కడ నుంచి తప్పించుకున్న యువతి బంధువులకు సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. నిన్న నిందితులందరూ కలిసి ఆటోలో కరీంనగర్ వైపు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపారు. నిందితుల్లో ఒకడైన బాలుడిని హైదరాబాద్‌లోని జువైనల్ హోంకు తరలించారు.

అన్నీ చూడండి

Balakrishna entry Mysore: దాదా గా బాలక్రిష్ణ ఎంట్రీ - తర్వాత బోయపాటి శీను తో అఖండ 3 ?

Jailer 2 trailer :రజనీకాంత్ చిత్రం జైలర్ 2 ట్రైలర్ చూస్తే జైలర్ 3 కూడా వుంటుందా ?

సినీ సెలెబ్రిటీలపై ఆర్జీవీ ఫైర్ - డీప్‌ఫేక్‌పై మీరు చేసేంది ప్రచారమే.. న్యాయం కాదు...

విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు సింగీతం శ్రీనివాస రావు : పవన్ కళ్యాణ్

సింగీతం యవ్వనంతోపాటే తుదిశ్వాస విడిచారు : కమల్ హాసన్

తర్వాతి కథనం
Show comments