మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 ఫిబ్రవరి 2020 (11:56 IST)

రోడ్డు పక్కన ఏడుస్తూ కనిపించిన బాలిక.. ఎత్తుకెళ్లి అత్యాచారం.. ఎక్కడ?

కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి కోసం ఎదురుచూస్తున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. రోడ్డు పక్కన ఏడుస్తూ కనిపించిన బాలికను చూసిన పోలీస్ పెట్రోలింగ్ వాహనంలోని పోలీసులు ఆరా తీయగా, ఈ అకృత్యం వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోతి వెళితే.. నూజివీడుకు చెందిన వ్యక్తి పనిపై బయటకు వెళ్లి రాత్రయినా తిరిగి రాకపోవడంతో కంగారు పడిన కుమార్తె రోడ్డుపైకి వచ్చి ఎదురుచూడసాగింది. అదే సమయంలో అటునుంచి వెళ్తున్న నిందితుడు ఆమెను బెదిరించి ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అనంతరం ట్రిపుల్ ఐటీ సమీపంలో వదిలేసి పారిపోయాడు. రోడ్డుపై ఏడుస్తూ బాలిక పోలీసుల కంట పడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో మరింత మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.