మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 19 అక్టోబరు 2021 (09:52 IST)

వైఎస్సార్‌టీపీ ప్ర‌క‌టించి వంద రోజులు... ఇడుపులపాయకు షర్మిల

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మంగళవారం ఇడుపులపాయకు వ‌స్తున్నారు. వైఎస్సార్‌టీపీని అధికారికంగా ప్రకటించి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 20వ తేదీన చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరిట పాద యాత్రకు వైఎస్‌ షర్మిల శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో నేడు ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు.

వైఎస్‌ షర్మిలతో పాటు తల్లి విజయలక్ష్మి కూడా రానున్నారు. మంగళవారం ఉదయం కడప విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయకు చేరుకుంటారు. తండ్రి సమాధికి నివాళులు అర్పించిన అనంతరం గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. తిరిగి సాయంత్రం ఇడుపులపాయ నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.
 
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పార్టీని ప్ర‌క‌టించి వంద రోజులు అయినా, ఇంకా ఆ పార్టీ ప్రాథ‌మిక ద‌శ‌లోనే ఉంది. కేవ‌లం ప్ర‌క‌ట‌న‌లు, ప్రెస్ మీట్లు... చిన్న చిన్న నిరాహార దీక్ష‌లు మిన‌హా పార్టీలో ఎదుగు బొదుగు లేకుండా ఉంది. ఈ ద‌శ‌లో ష‌ర్మిల చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరిట పాద యాత్ర ఎలాంటి ఫ‌లితాల‌ను ఇస్తుందో వేచి చూడాలి.