శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 26 మే 2021 (12:07 IST)

అతి తీవ్ర తుఫానుగా యాస్, బాలాసోర్ వద్ద తీరం దాటుతూ వుంది

వాయువ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫానుగా యాస్ కొనసాగుతోంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు మధ్యాహ్నం, ఉత్తర ఒరిస్సాలోని ధర్మ, బాలసోర్ మధ్య తీరం దాటుతూ వుంది. ఇది ప్రస్తుతం గంటకు 12  కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.

పారాదీప్‌కు తూర్పు దిశగా 90 కిలోమీటర్లకు, బాలాసోర్‌కి దక్షిణ ఆగ్నేయంగా 140,  కిలోమీటర్లు, ధర్మాకి  తూర్పు ఆగ్నేయంగా దిశగా 85 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

తుపాను తీరం దాటే సమయంలో గంటకు 155 నుంచి 165 కొన్నిసార్లు 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.ప్రస్తుతం  తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను నేపథ్యంలోమత్స్యకారులు ఎవరు వేటకి వెళ్ళకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.