గురువారం, 24 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (10:39 IST)

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

bhumana karunakar reddy
తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న ఉద్యోగుల్లో రెండు వేల మంది తమ నిఘా నేత్రాలేనని, అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని క్షణాల్లో తమకు చేరవేస్తారని తితిదే మాజీ చైర్మన్, వైకాపా సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. 
 
తిరుమల గోశాలలో గోవులు మృతి చెందాయంటూ భూమన కరుణార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తితిదే ఈవో శ్యామల రావు ఖండించారు. దీనిపై భూమన మరోమారు స్పందిస్తూ, తితిదేలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 2 వేల మంది తమ నిఘా నేత్రాలేనని, అక్కడ జరుగుతున్న పరిణామాలపై వారంతా ఎప్పటికపుడు తమకు సమాచారం చేరవేస్తూనే ఉంటారని తెలిపారు. 
 
అలాగే, తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఆవుల మృతిపై తాను చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడివున్నట్టు తెలిపారు. గోవుల మృతిపై తితిదే పాలకులు, స్థానిక ఎమ్మెల్యే ప్రకటనల్లో వైరుధ్యాలు ఉన్నాయని, చైర్మన్, ఈవోను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తాము విడుదల చేసిన ఫోటోలపై ఏ విచారణకైనా సిద్ధమని తప్పని తేలితే ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని భూమన సవాల్ విసిరారు.