ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 మే 2024 (10:54 IST)

పెళ్లికి ఒప్పుకోలేదని యువతి గొంతుకోసి.. తర్వాత గొంతు కోసుకున్న ప్రియుడు (Video)

పెళ్లికి ఒప్పుకోలేదని ఓ కసాయి ప్రియుడు యువతి గొంతుకోశాడు. ఆ తర్వాత గొంతు కోసుకున్న ప్రియుడు. ఈ ఘటన ఏలూరు - సత్రంపాడులో రత్నా గ్రేస్ (23) ఏసురత్నం (23) స్నేహితులు కాగా ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని ఏసురత్నం కొంతకాలంగా వెంటపడుతున్నాడు. ఈ నెల 26వ తేదీన రత్నా గ్రేస్‌కి వేరే యువకుడితో నిశ్చితార్థం కాగా గురువారం మధ్యాహ్నం ఏసురత్నం కత్తితో రత్నా గ్రేస్ గొంతుకోసి హత్య చేసిన తర్వాత తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. 
 
వామ్మో.. తెలంగాణ సచివాలయం ఎదురుగా మసాజ్ సెంటర్!! (Video) 
 
అది సాక్షాత్ తెలంగాణ రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయం. ఈ సెక్రటేరియట్ ఎదురుగా మసాజ్ సెంటర్ గుట్టుచప్పుడు కాకుండా నడుస్తుంది. దీన్ని హైదరాబాద్ సైఫాబాద్ పోలీసులు పసిగట్టారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా అమృత కాస్టల్ హోటల్‌లో ఈ మసాజ్ సెంటర్ కొనసాగుతూ వచ్చింది. 
 
సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమృత కాస్టల్ హోటల్లోని మేఘవి వెల్‌నెస్ స్పా పేరుతో ఈ సెంటర్ కొనసాగుతుండగా, సైఫాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. మసాజ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. స్పా నిర్వాహకులపై కేసు నమోదు చేసుకొని సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
పల్నాడు జిల్లా : వైకాపా నేత గడ్డి వాములో పెట్రోల్ బాంబులు!! 
 
పల్నాడు జిల్లాలో వైకాపా నేతకు చెందిన గడ్డి వాములో దాచిపెట్టిన పెట్రోల్ బాంబులను గుర్తించారు. ఈ గ్రామంలో బుధవారం పోలీసులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో గడ్డి వాములో దాచిన పెట్రోల్ బాంబులను గుర్తించారు. మొత్తం నాలుగు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. కౌంటింగ్‌ రోజు అలజడులు సృష్టించేందుకు వాటిని దాచి ఉంచారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 
 
ఇదే గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్‌ 21న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోదరి రోడ్డుషో నిర్వహిస్తుండగా వైకాపా వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. రోడ్డుకు అడ్డంగా వైకాపా ప్రచార వాహనాలను నిలిపి.. ఇదేమిటని అడిగిన టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. అదేరోజు రాత్రి రెండింటి ప్రాంతంలో గ్రామంలోని టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఇప్పటికైనా గ్రామంలో అల్లర్లకు పాల్పడేవారిని బైండోవర్‌ చేయకపోతే కౌంటింగ్‌ రోజు దాడులు చేసే అవకాశముందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. గడ్డివాము పరిసరాల్లోని నివాసితులను విచారిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై రాజేష్‌ తెలిపారు.