అదానీ దేశం పరువు తీస్తే జగన్ ఏపీ పరువు తీశారు : వైఎస్.షర్మిల (Video)
పారిశ్రామికవేత్త అదానీ దేశం పరువు తీస్తే, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ పరువు తీశారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానికి రూ.1750 కోట్ల మేరకు అదానీ గ్రూపు లంచాలు ఇచ్చినట్టు అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థ ఎఫ్.బి.ఐ తేల్చింది. పైగా, ఈ అంశంపై పలువురిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీనిపై వైఎస్ షర్మిల స్పందిస్తూ, ఏపీ జగన్ పరువు తీశారని, అదానీ దేశం పరువు తీశారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశ అవినీతి గురించి చర్చ జరుగుతుందన్నారు. జగన్... మీరు తీసుకున్న రూ.1750 కోట్ల లంచం ప్రజలకు ఎంత భారంగా మారుతుందో ఒక్కసారైనా ఆలోచించారా?
కారు యజమానిని వణికించిన కాకులు
ఓ కారు యజమానికి అనేక కాకులు వణికించాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి కారణం లేకపోలేదు. కాకి ఒకటి ఓ కారుపై వాలింది. యజమాని వచ్చి కాకే కదా.. హుష్ అంటే పోతుందని భావించాడు. కానీ, కారుపై అలాగే ఉండిపోయింది. చేతిలో నెట్టివేయాలని చూశాడు. కానీ, కాకి మాత్రం అక్కడ నుంచి కదల్లేదు. ఇలా కాదని దగ్గరగా వెళ్లి కాకిని చేతిలోకి తీసుకుని ఓ పక్కకు విసిరేద్దామనుకున్నాడు.
కానీ కాకిని అలా చేతిలోకి తీసుకోగానే... చుట్టుపక్కల ఉన్న మరికొన్ని కాకులు వేగంగా దూసుకొచ్చాయి. ఆ కారు యజమానిని కాళ్లతో తన్ని ఎగిరిపోవడం మొదలుపెట్టాయి. ఇదేమిటని అతడు భయంగా చూస్తుంటే... పక్కనే ఉన్న చెట్టు కొమ్మపై వాలి, మళ్లీ మళ్లీ దాడి చేయడానికి ప్రయత్నించాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియోకో లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వేల కొద్దీ లైకులు కూడా వచ్చాయి.