శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 జనవరి 2024 (20:30 IST)

మాట నిలబెట్టుకోని వారంతా కేడీలే.. మోడీ కూడా అంతే..: వైఎస్ షర్మిల

sharmila
తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోని వారు కేడీ కాగా మోడీ ఎలా అవుతారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రధాని మోడీతో పాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడులు కూడా కేడీలేనని ఆమె విమర్శించారు. ఆదివాం తిరుపతి, చిత్తూరు జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తిరుపతిలో జరిగిన ఈ సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ, తిరుపతి వెంకన్ సాక్షిగా ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆమె నిలదీశారు. 
 
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతో 90 శాతం నిధులు తామే ఇస్తామని ప్రధాని మోడీ ప్రకటించారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. మా పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు అంటే మరి మీరు కేడీ కాక మోడీ అవుతారు? అని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. 
 
'పదేళ్లయినా మాకు ఇంతవరకు రాజధాని లేదు. చంద్రబాబేమో అమరావతి రాజధాని అని, సింగపూర్ చేస్తానని త్రీడీ, సినిమా గ్రాఫిక్స్ చూపించారు. జగనన్న గారేమో మాకు ఒకటి సరిపోదు... మూడు కావాలి అని మొత్తం గందరగోళం చేశారు. ఆఖరికి మాకు ఒక్క రాజధాని కూడా లేదు. రాష్ట్రంలో ఏ నగరంలోనూ ఒక్క మెట్రో కూడా లేదు. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా మెట్రో లేదంటే అది ఒక్క ఏపీలోనే. మేం అంత  తీసిపోయామా?
 
మాకు ప్రత్యేక హోదా లేదు, పోలవరం లేదు, రాజధాని లేదు, మా బిడ్డలకు ఉద్యోగాలు లేవు, మా రైతులకు భరోసా లేదు. మరి మాకు ఏం మిగిల్చారు. మీరు సమస్తం దోచుకుంటే మరి మీరు కేడీ కాక మోడీ ఎలా అవుతారు?' అంటూ  షర్మిల ధ్వజమెత్తారు.
 
ఇదే తిరుపతి నగరంలో నిలబడి మోడీ గారు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ఏమైంది మోడీ గారూ అని అడుగుతున్నాం. మాట నిలబెట్టుకోని మీరు మోడీ అవుతారా? కేడీ అవుతారా? అని నిలదీశారు. "మాట నిలబెట్టుకోని మీరు కేడీనే అవుతారు... ఏపీ ప్రజలకు మోడీ చేసింది పాపం, అన్యాయం... బీజేపీ కేడీల పార్టీ. ఆ కేడీ పార్టీకి మద్దతు తెలిపిన బాబు, జగనన్న కూడా కేడీలే అవుతారు" అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.