మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 24 జనవరి 2024 (12:32 IST)

జగన్ రెడ్డి అంటే నచ్చలేదా? ఐతే జగన్ అన్నగారు అంటా: వైఎస్ షర్మిల

YS Sharmila
కర్టెసి-ట్విట్టర్
ఏపీ కాంగ్రెస్ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల తన మాటలకు క్రమంగా పదును పెడుతున్నారు. ఏపీలో అభివృద్ధి జరిగింది శూన్యం అని విమర్శించిన షర్మిల.. వైవి సుబ్బారెడ్డికి నేను జగన్ రెడ్డి గారు అని పిలుస్తుంటే నచ్చలేదని అంటున్నారనీ, అందువల్ల ఇకపై జగన్ అన్నగారు అని పిలుస్తా అంటూ వ్యాఖ్యానించారు.
 
ఏపీలో అభివృద్ధి శూన్యమైందని అన్నారు. అసలు రాజధాని ఎక్కడ వున్నదో వైసిపి చెప్పగలదా అంటూ ప్రశ్నించారు. అభివృద్ధి జరిగిందని వాదిస్తున్న వైసిపి నాయకులు... ఎక్కడ జరిగిందో తమకు చెప్పాలని డిమాండ్ చేసారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి వస్తాయనీ, టైం వైసిపి చెప్పినా సరే లేదంటే నన్ను చెప్పమన్నా చెబుతానంటూ వెల్లడించారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.." ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నారు.. నాలుగున్నర ఏళ్ళు మోసం చేసి ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ లు అంటున్నారు. శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సులో ప్రయాణం చేసి మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాను. వారి బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. మద్య నిషేదం అని చెప్పారు. ఎక్కడ చూసినా మద్యం ఏరులైపారుతుంది. మద్య నిషేదం చేయకపోతే ఓట్లు కూడా అడగను అన్నారు. మరి ఎక్కడకి పోయే మద్య నిషేదం హామీ జగన్ అన్న గారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రత్యేక హోదా తప్పక వస్తుంది. తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే పెడతానని రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు. కావునా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైన్యంలా పని చేయాలి." అన్నారు.
 
babu - pawan
అధికారం తెదేపా-జనసేన పార్టీలదే
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రముఖ హాస్య నటుడు, థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వి అన్నారు. పైగా, తాను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ వదిలిన బాణాన్ని అని చెప్పారు. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల మాత్రం కాంగ్రెస్ వదిలిన బాణం అని చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, మార్చి నెలలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని చెప్పారు. సినిమాలు, సినిమా కలెక్షన్లు, పంపిణీదారులు గురించి మాట్లాడేవారు కూడా మంత్రులేనా అని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి మంత్రి అంబటి రాంబాబుకు ఏం తెలుసని ఆయన ప్రశ్నించారు. ఈ అంబటి రాంబాబు.. ఎపుడు చూసినా మూడు పెళ్లిళ్లు, రెండు చోట్ల ఓటమి గురించే మాట్లాడతాడని విమర్శించారు. 
 
పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయిందా అని నిలదీశారు. చివరకు మూడు రాజధానుల పేరుతో ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు వైకాపా తనను వాడుకుని వదిలిపివేసిందని త్వరలోనే వీళ్లందరికీ తగిన రీతిలో సమాధానం చెపుతానని పృథ్వి హెచ్చరించారు. 
 
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణం అని చెప్పారు. ఆమె కారణంగా అధికార వైకాపాకు ఇబ్బందులు తప్పవన్నారు. 136 సీట్లతో టీడీపీ - జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ఆయన చెప్పారు. ఈ రెండు పార్టీలు కలిసి 136కు పైగా సీట్లను గెలుచుకుంటాయని చెప్పారు. 175 సీట్లను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన వైకాపా నేతలు ఇపుడు ఎందుకు వణికిపోతున్నారని, స్థానాలు మార్చినంతమాత్రాన ప్రజలు ఓటు వేయరని ఆయన గుర్తుచేశారు.