ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (10:17 IST)

గంగిరెడ్డి బెయిల్ : సీబీఐకు షాకిచ్చిన కడప కోర్టు -

దివంగత మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలన్న సీబీఐ కోర్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్‌ను తిరస్కరించలేమని పేర్కొంది. 
 
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అందువల్ల బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరుతూ కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 
 
దీనిపై వాదనలు జరుగగా, ఈ వాదనలు ఆలకించిన కోర్టు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఇదే కేసులో మరో నిందితుడైన సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై విచారణకు ఈ నెల 7వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.