శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By జె
Last Modified: శుక్రవారం, 29 మార్చి 2019 (20:45 IST)

నగరి నియోజకవర్గంలో వైఎస్ జగన్ రోడ్ షో... భారీ జనం, రోజాకే ఓటు వేయాలి...(Video)

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం, పుత్తూరులో వైయస్ఆర్సిపి అధినేత జగన్మెహన్ రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భారీగా హాజరైన జనసందోహంతో మాట్లడుతూ చంద్రబాబు అధికారంలోని రావడమే షుగర్ ప్యాక్టీరీలను మూయించివేశారని, మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదిని, అలాగే పాల రైతులకు కూడా గిట్టుబాలు ధర ఇవ్వడం పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. 
 
నవరత్నాలు ప్రతిపాదించిన తర్వాత చంద్రబాబు నాయుడు పింఛన్లను మూడు వేలకు మార్చాడని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు 6 వేల పాఠశాలలను మూయించి వేశాడని, అయితే తాను అధికారంలోని వస్తే పిల్లవాడిని పాఠశాలకు పంపితే చాలు సంవత్సరానికి 15 వేలు ఇస్తామని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి రావడమే కరెంట్ చార్జీలు, ఇంటి పన్నులు, డీజల్, పెట్రోల్ ధరలు, నిత్యావసర వస్తువలు ఇష్టారాజ్యంగా పెంచేశారని గుర్తు చేశారు. 
 
చంద్రబాబు ఇచ్చే 3 వేలు తీసుకుని మోసపోవద్దని ఆయన తెలిపారు. జన్మభూమి కమీటీతో చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని, జన్మభూమి కమీటీలు చెప్పింది వినాలని ప్రజలకు ఇబ్బందులకు పెడుతున్నారని తెలిపారు. రాజన్న రాజ్యం రావాలంటే ప్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన అభ్యర్ధించారు. ఆయనతో పాలు నగరి నియోజకవర్గం అభ్యర్థి ఆర్కే రోజా, సత్యవేడు అభ్యర్థి ఆదిమూలం, ఎంపి అభ్యర్థి రెడ్డెప్పా, జీడి నెల్లూరు అభ్యర్థి నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామాచంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీడియో చూడండి...