అక్కడికి వెళ్ళి బాబుకి బైబై చెప్పండి.. వైఎస్ షర్మిళ

ys sharmila
జె| Last Modified శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (19:51 IST)
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. గెలుపు ధీమాలో ఎవరికివారు ఉన్నారు. అయితే సర్వేలన్నీ తమకే అనుకూలమని వైసిపి భావిస్తుంటే, టిడిపి మాత్రం చివరకు అధికారం చేజిక్కించుకునేది మేమేనన్న ధీమాలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గెలుపు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని, పసుపు... కుంకుమ, పెన్షన్లు, అన్నదాన సుఖీభవ అనేవి నవరత్నాల ముందు పనిచేయదన్నారు. ప్రజల సమస్యలను దగ్గర నుంచి చూసిన వ్యక్తి జగనని, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు షర్మిళ.

మా అన్న సిఎం కావడం ఖాయం. ఈసారి ప్రజలందరూ వైసిపికి అనుకూలంగా ఓట్లేశారు. ఎన్నికలు ఒన్ సైడ్‌గానే జరిగాయంటున్నారు షర్మిళ. చంద్రబాబుకు బైబై చెప్పాల్సిన సమయం వచ్చిందని, జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతికి వెళ్ళి బైబై చెప్పి వస్తానన్నారు షర్మిళ.దీనిపై మరింత చదవండి :