గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 9 మే 2024 (19:52 IST)

పోలీసులకు శని-ఆది శెలవులు ఇస్తాం: చీపురుపల్లిలో చంద్రబాబు

Chandrababu
చీపురుపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అవినీతిపరుడు అని బొత్స ఆరోపణలు చేయడాన్ని ప్రశ్నించారు. ఈ ఆరోపణలు మీరు కాదు మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డితో చేయించండి, అప్పుడు చూడండి అంటూ సవాల్ విసిరారు.
 
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేందుకు ఉద్యోగులు, పోలీసులు పెద్దసంఖ్యలో తరలివచ్చారనీ, దాదాపు 99 శాతం మంది ఎన్డీయేకి ఓట్లు వేసారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా పోలీసులు సేవలు మరువలేనివనీ, వారు ఎంతగానో కష్టపడుతుంటారని అన్నారు. అందుకే తాము అధికారంలోకి రాగానే పోలీసులకు వారంలో 2 రోజులు శెలవులు ఇస్తాన్నారు.
 
శని-ఆదివారాలు వారికి శెలవులు ఇస్తామనీ, వీకెండ్ హాలిడేస్ ను ఐటీ ఉద్యోగులు మాదిరి వారు కూడా సంతోషంగా గడపాలని అన్నారు. ఉద్యోగులందరూ తమ కుటుంబ సభ్యులకు ఎన్డీయే పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేయాలని చెప్పాలని విజ్ఞప్తి చేసారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వచ్చిన 24 గంటల్లోనే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ని రద్దు చేస్తాము. ప్రజల భూములు, ఇళ్లు లాక్కునే, ఈ చట్టాన్ని తగలబెట్టేస్తామని అన్నారు.