శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (19:46 IST)

ఏపీలో కొత్తగా 1,502 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 63,717 మంది నమూనాలు పరీక్షించగా 1,502 కొత్త కేసులు నమోదయ్యాయి. 16 మంది మృతి చెందారు.

కరోనా నుంచి నిన్న 1,525 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,883 యాక్టివ్‌ కేసులున్నట్లు శ‌నివారం వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.

కొవిడ్‌ వల్ల చిత్తూరులో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఒకరు, ప్రకాశంలో ఒకరు మృతి చెందారు.