కులపిచ్చతో వ్యాక్సిన్ కంపెనీపై ఏడ్చే బదులు... లోకేష్ తీవ్ర విమర్శ
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ట్విట్టర్ లో తీవ్రంగా నోరు పారేసుకుంటున్నారు. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు.
జగన్ రెడ్డి గారి పాలన వల్ల అధోగతిలో అగ్రస్థానం .... ప్రగతిలో చిట్టచివరి స్థానంలో ఉంది రాష్ట్రం.
ఎవరెలా చస్తే నాకేంటి? తాడేపల్లి కొంపలో నేను హాయిగా నిద్రపోతే చాలు... అన్నట్టు ఉంది జగన్ రెడ్డి గారి వ్యవహార శైలి. థర్డ్ వేవ్ హెచ్చరికలతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమై, వ్యాక్సినేషన్ వేగవంతం చేసాయి. మన రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం 18 ఏళ్ళు పైబడిన వారికి ఒక్క డోసు 40 శాతం, రెండు డోసులను 16 శాతం మందికి వేసి దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంది.
కులపిచ్చతో వ్యాక్సిన్ కంపెనీపై ఏడ్చే బదులు... వచ్చిన వ్యాక్సిన్ వృథా కాకుండా వేసి ఉంటే, ఈ దుస్థితి వచ్చేది కాదు. మాస్కుతో మొఖం తుడుచుకొని, తాడేపల్లి కొంపలో ముడుచుకొని పడుకున్న జగన్ రెడ్డి గారు నిద్రలేవండి. థర్డ్ వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపనుందనే హెచ్చరికలపై మేల్కొనండి. అంటూ, నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు.