ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (11:59 IST)

పేకాట ఆడుతూ పట్టుబడిన తెలుగు నటుడు

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు కృష్ణుడుని పోలీసులు అరెస్టు చేశారు. పేకాట ఆడుతుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి మియాపూర్‌లోని ఓ విల్లాపై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణుడు పేకాట ఆడుతూ చిక్కాడు. ఆయనతోపాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
మియాపూర్‌లోని శిల్పా పార్కులో పెద్దిరాజు అనే వ్యక్తితో కృష్ణుడు పేకాట నిర్వహిస్తున్నాడన్న పక్కా సమాచారం పోలీసులు అక్కడకు వెళ్లి సోదాలు చేశారు. ఆ సమయంలో పేకాటలో నిమగ్నమైవున్న ప్రతి ఒక్కరినీ అదుపులోకి తీసుకున్నారు. 
 
పేకాటరాయుళ్లను మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. కాగా, నిందితులను వ్యక్తిగత పూచీకత్తుపై పోలీసులు విడిచిపెట్టారు. శనివారం సాయంత్రం విచారణకు రావాలని ఆదేశించారు. కృష్ణుడు వినాయకుడు సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే.