శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (19:24 IST)

పట్టాభికి 14 రోజుల రిమాండ్‌

టిడిపి అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను గురువారం తోట్లవల్లూరు పీఎస్‌ నుంచి విజయవాడకు తీసుకొచ్చిన పోలీసులు సాయంత్రం కోర్టులో హాజరు పర్చారు. ఈ సందర్భంగా పట్టాభికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరుపు న్యాయవాది కోరారు. 
 
దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పట్టాభిపై గతంలోనే అనేక కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పట్టాభికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అంతకు ముందు ప్రభుత్వాసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించారు.