మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (13:11 IST)

నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి

water
నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సోమందేపల్లి మండలంలోని పందిపర్తిలో గురువారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పందిపర్తి గ్రామానికి చెందిన రమేషరెడ్డి, అంబికల రెండో కుమారుడు పవనకుమార్‌రెడ్డి(2) ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులోకి పడిపోయాడు. 
 
అయితే ఆ విషయాన్ని గమనించని తల్లిదండ్రులు, బంధువులు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించారు. చివరకు సంపు మూత పూర్తిగా తెరిచి చూడగా అందులో బాలుడు పవన కుమార్‌రెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. 
 
అప్పటిదాకా ఆడుకుంటూ ఇంట్లో సందడి చేసిన చిన్నారి ఒక్కసారిగా అచేతన స్థితిలో ఉండటాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.