సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 మే 2022 (08:12 IST)

పెళ్ళిపేరుతో నమ్మించి స్నేహితులతో అత్యాచారం చేయించిన ప్రియుడు

rape demo
ఏపీలోని సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుంటానని తన ప్రియురాలిని నమ్మించి తన వెంట తీసుకెళ్ళిన ఓ కిరాతక ప్రియుడు, తనతో పాటు తన స్నేహితులతో అత్యాచారం చేయించాడు. ఈ సామూహిక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని గోరంట్లకు చెందిన 22 యేళ్ల విద్యార్థిని తిరుపతిలోని కృష్ణతేజ ఫార్మసీ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతూ, కాలేజీ హాస్టల్‌లో ఉంటుంది. ఈమెకు గోరంట్ మండలం మల్లాపల్లికి చెందిన సాధిక్ అనే యువకుడితో ఈ విద్యార్థిని గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తన ప్రియురాలిని కలిసి సాధిక్.. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆ యువతి అతని మాటలు నమ్మి, అతను వచ్చిన కారులో ఎక్కింది. 
 
ఆ తర్వాత మల్లాపల్లిలోని తన గదిలో ఆ యువతిని బంధించి తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ యువతిని హత్య చేసి పైకప్పుకు చున్నీతో ఉరేసుకున్నట్టుగా వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం పోలీసులకు చెప్పాడు. అయినప్పటికీ పోలీసులు సాధిక్‌ను అరెస్టు చేయకుండా యువతి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.