ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 22 డిశెంబరు 2016 (12:39 IST)

తెలుగు రాష్ట్రాల్లో 5000 మంది 'నల్ల'బాబులు... 3 నగరాలకు ఐటీ సిబ్బంది... రూ.2000 నోట్లు పారేసుకోవాలేమో?

ఇపుడు ఆదాయపు పన్ను శాఖ సిబ్బంది టార్గెట్ పెడితే చాలు అక్కడ కోట్లలో డబ్బులు, కేజీలకొద్దీ బంగారం నిల్వలు బయటపడుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాలను తమ తనిఖీలతో హడలుపుట్టిస్తున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు నెక్ట్స్ టార్గె

ఇపుడు ఆదాయపు పన్ను శాఖ సిబ్బంది టార్గెట్ పెడితే చాలు అక్కడ కోట్లలో డబ్బులు, కేజీలకొద్దీ బంగారం నిల్వలు బయటపడుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాలను తమ తనిఖీలతో హడలుపుట్టిస్తున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు నెక్ట్స్ టార్గెట్ తెలుగు రాష్ట్రాలపై పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల్లో సుమారు 5000 మంది నల్ల బాబులు భారీగా కొత్త రూ.2000 నోట్ల కట్టలను పట్టుకెళ్లినట్లు పక్కా సమాచారం వారి వద్ద వున్నట్లు సమాచారం. 
 
వీరి లావాదేవీలు కూడా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్టణం నగరాల్లో ఎక్కువగా జరిగినట్లు ఐటీ శాఖ గమనించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి లిస్టు అంతా రెడీ అయిపోయినట్లు సమాచారం. ఇక వరసబెట్టి దాడులు చేయడమే తరువాయి అనుకుంటున్నారు. 
 
మొత్తం 5000 మంది పెద్ద నల్లకుబేరులను పట్టేశాక... తర్వాత రెండోస్థాయిలో మళ్లీ తనిఖీలు ఉంటాయని అంటున్నారు. మొత్తంగా చూస్తే ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన రూ.2000 నోట్లే వారిని పట్టిస్తున్నట్లు సమాచారం. పాత నోట్లను పడేసిన నల్లబాబులు చచ్చీచెడీ కొత్త నోట్లు తెచ్చుకున్నా అవికూడా వారిని జైల్లోకి పంపిస్తాయన్నమాట. ఇప్పుడు ఈ నోట్లను కూడా పడేసుకుంటారేమో...?!!