శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 జూన్ 2021 (19:08 IST)

ఏపీలో కరోనా అప్డేట్ .. ఒక్క రోజే 6,617 కేసులు.. 57మంది మృతి

ఏపీలో బుధవారం కొత్తగా 6,617 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇవాళ ఒక్కరోజే 57 మంది మృతి చెందారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18లక్షల, 26వేల, 751కి చేరాయి.

ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 12వేల, 109 మంది మృతి చెందగా.. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 17లక్షల, 43వేల, 176కి చేరింది. ఏపీలో ప్రస్తుతం 71వేల 466 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
 
చిత్తూరు, గుంటూరులో కరోనాతో 9 మంది చొప్పున మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా, శ్రీకాకుళంలో ఐదుగురు చొప్పున మృతి చెందారు.

విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలో నలుగురు చొప్పున మృతి చెందారు. కర్నూలు జిల్లాలో ముగ్గురు, కడప, నెల్లూరు, ప్రకాశం, విజయనగరంలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.