శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 ఆగస్టు 2021 (10:26 IST)

అమరావతి రాజధాని ఉద్యమానికి 600 రోజు

అమరావతి రాజధాని ఉద్యమానికి 600వ రోజుకు చేరుకుంది. ఉద్యమ కార్యాచరణను అమరావతి జేఏసీ రాజధానిని ప్రకటించింది. ఆదివారం ఉదయం 9 గంటలకు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో బైక్ ర్యాలీ జరగనుంది. 
 
హైకోర్టు దగ్గర ఉన్న జడ్జి క్వార్టర్ల నుంచి బైక్ ర్యాలీ ప్రారంభం కానుంది. మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు ర్యాలీ జరగనుంది. మార్గమధ్యలో చర్చి, మసీదులను సైతం రైతులు సందర్శించనున్నారు. 
 
మరోవైపు, అమరావతి పోరాటం 600 రోజులైనా ఆగలేదని, రైతులు, మహిళల పోరాటస్ఫూర్తి తెలుగు జాతి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 
 
అమరావతి రైతులు ఇచ్చిన భూముల్లో కట్టిన సచివాలయం, శాసనసభల్లోనే ముఖ్యమంత్రి సహా ప్రభుత్వ పెద్దలంతా కూర్చుని పనిచేస్తున్నారని, అదే భూముల్లో కట్టిన హైకోర్టు చుట్టూ రోజూ తిరుగుతూ ఆ రైతుల మొ హం చూడటానికి మాత్రం ఇష్టపడటం లేదని విమర్శించారు.
 
రైతుల పోరాటాన్ని అణచివేయడానికి, అమరావతి రాజధానిని నాశనం చేయడానికి వైసీపీ ప్రభుత్వం అనేక దారుణాలకు పాల్పడిందంటూ వివరించారు. చివరకు రాజధానిలో నిర్మించిన రోడ్లను కూడా తమ పార్టీ వారితో తవ్వించి కంకర, ఇసుక అమ్ముకొనే దుస్థితికి ప్రభుత్వ పెద్దలు దిగజారారన్నారు. 
 
అమరావతి నాశనం వల్ల ఎక్కువ నష్టపోయింది దళితులేనని తెలిపారు. అమాయక మొహం పెట్టుకొని తిరిగే జగన్‌రెడ్డి లోపల పెద్ద శా డిస్టు ఉన్నారని, ఆయన క్రూరత్వం అమరావతి నాశనంలో కనిపిస్తోందన్నారు.