సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (17:32 IST)

ఏపీలో కొత్తగా మరో 1900 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం కొత్తగా మరో 1908 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1908 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడి వారిలో 2103 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 
 
మరో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసులు 19,80,258కి పెరిగాయి. ఇప్పటివరకు 19,46,370 మంది కోలుకున్నారు. మరో 20,375 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,513కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 80,376 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.